Home  »  Bollywood News  »  'డాన్ 3' ప్రాజెక్ట్‌ను షారుఖ్ ఖాన్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా?

Updated : May 27, 2026

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన యాక్షన్ ఫ్రాంచైజీలలో 'డాన్' సిరీస్ ఒకటి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వచ్చిన 'డాన్' (2006), 'డాన్ 2' (2011) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడమే కాకుండా షారుఖ్‌కు ఒక సరికొత్త స్టైలిష్ యాక్షన్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో అభిమానులు ఈ సిరీస్‌లో మూడో భాగం 'డాన్ 3' (Don 3) కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. అయితే, అందరినీ షాక్‌కు గురిచేస్తూ ఈ ప్రాజెక్ట్ నుంచి షారుఖ్ ఖాన్ తప్పుకున్నాడు. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్‌(Ranveer Singh)ను కొత్త డాన్‌గా ప్రకటిస్తూ మేకర్స్ అఫీషియల్ అప్‌డేట్ కూడా ఇచ్చారు. అయితే, అంతటి భారీ క్రేజ్ ఉన్న ఈ ఐకానిక్ సినిమాను షారుఖ్ ఖాన్ అసలు ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయంపై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత రితేష్ సిధ్వానీ, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ సుదీర్ఘ కాలం పాటు 'డాన్ 3' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేశారు. ఈ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత షారుఖ్ ఖాన్‌తో వారు అనేకసార్లు చర్చలు జరిపారు. కానీ, కథ విషయంలో షారుఖ్, ఫర్హాన్ అక్తర్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. 'పఠాన్', 'జవాన్' వంటి భారీ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత, షారుఖ్ ఖాన్ తన కెరీర్ ప్లానింగ్ విషయంలో చాలా స్పష్టమైన అంచనాలతో ఉన్నారు. యూనివర్సల్ ఆడియన్స్ ను ఆకట్టుకునే క్లీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. 'డాన్' సిరీస్ స్టైలిష్‌గా, కేవలం అర్బన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో అది ప్రస్తుత తన మార్కెట్ స్ట్రాటెజీకి సరిపోదని కింగ్ ఖాన్ భావించారు.

మరోవైపు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఈ 'డాన్ 3' కోసం ఒక సరికొత్త మరియు విభిన్నమైన కాన్సెప్ట్‌ను ప్లాన్ చేశారు. బాలీవుడ్‌కు చెందిన మూడు వేర్వేరు తరాల (Three Generations) స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పైకి తీసుకురావాలనేది ఫర్హాన్ క్రేజీ ఐడియా. ఈ క్రమంలో ఒరిజినల్ డాన్ అమితాబ్ బచ్చన్, సెకండ్ జనరేషన్ డాన్ షారుఖ్ ఖాన్ మరియు ఈ తరం యువ హీరోలలో ఒకరిని కలిపి ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రూపకల్పన చేయాలని భావించారు. 

అయితే, ఈ ఐడియా వినడానికి బాగున్నప్పటికీ, స్క్రిప్ట్ పరంగా ఇది కాస్త కృత్రిమంగా అనిపించిందని, కేవలం హైప్ కోసమే తప్ప కథలో అంత బలం ఉండకపోవచ్చని షారుఖ్ భావించినట్లు ఇండస్ట్రీ టాక్. ఎంతటి భారీ ఫ్రాంచైజీ అయినప్పటికీ కథ విషయంలో 100 శాతం సంతృప్తి లేకపోవడం వల్లే షారుఖ్ 'డాన్ 3' ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి.

షారుఖ్ ఖాన్ నిష్క్రమణ తర్వాత, ఫర్హాన్ అక్తర్ ఈ పాత్రను నేటి తరం హీరో రణ్‌వీర్ సింగ్‌కు అప్పగించారు. అయితే, షూటింగ్ ప్రారంభానికి కొన్ని వారాల ముందే రణ్‌వీర్ ఈ సినిమా నుండి తప్పుకోవడం కొత్త వివాదానికి దారితీసింది. రణ్‌వీర్ తప్పుకోవడంతో ప్రీ-ప్రొడక్షన్ రూపంలో తాము చేసిన ఖర్చు అంతా వృథా అయిందని, దీనివల్ల రూ. 40-45 కోట్ల వరకు భారీ నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఆరోపించారు. ఈ వివాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్' (FWICE) రంగంలోకి దిగింది.  సమస్య పరిష్కారం అయ్యే వరకు సినీ పరిశ్రమకు చెందిన ఏ విభాగానికి చెందిన కార్మికులు, సాంకేతిక నిపుణులు రణ్‌వీర్‌తో కలిసి పని చేయకూడదని ఫెడరేషన్ పిలుపునిచ్చింది.

అయితే షారుఖ్ ఖాన్ ఏదైతే కారణంతో ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశాడో, రణ్‌వీర్ కూడా అదే కారణంతో తప్పుకున్నట్లు తెలుస్తోంది.  కథలో బలమైన అంశాలు లోపించాయని, సినిమా స్థాయికి తగ్గట్టుగా స్క్రిప్ట్ లేదని రణ్‌వీర్ భావించినట్లు సమాచారం. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.